వంతెన ప్రమాదంలో బీజేపీ ఎంపీ కుటుంబ సభ్యుల మృతి
గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ప్రమాదం రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కల్యాణ్‌జీ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. కుందారియా సోదరి కుటుంబానికి చెందిన 12 మంది తీగల వంతెన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తన సోదరికి చెందిన నలుగురు కుమార్తెలు, ముగ్గురు కోడళ్లు, ఐదుగురు పిల్లలు ఈ ప్రమాదంలో చనిపోయారని ఆవేదన చెందారు. ఈ ప్రమాదంపై ఐదుగురితో కూడిన బృందం దర్యాప్తు జరుపుతోందని.. బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని ఆయన చెప్పారు.