పరీక్షలో ఫెయిల్..విద్యార్ధిని ఆత్మహత్య
పరీక్షల్లో ఫెయిలైనందుకు ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 19 ఏళ్ల శ్వేత నిన్న రాత్రి ప్రకటించిన నీట్-యుజీ పరీక్షల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కిల్‌పాక్ మెడికల్ కాలేజీకి తరలించారు. మరోవైపు విద్యార్ధులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు కౌన్సిలర్లను నియమించాలని మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు.

నిన్న రాత్రి విడుదలైన నీట్-యూజీ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన తనిష్క మొదటి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండవ ర్యాంక్, కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలే మూడు స్థానాల్లో నిలిచారు.
టాప్-10 ర్యాంకులు సాధించి వారు వీరే
- తనిష్క (రాజస్థాన్)
- ఆశీష్ బాత్రా (ఢిల్లీ)
- హృషికేష్ నాగభూషణ్ గంగూలే (కర్ణాటక)
- రుచా పవాశి (కర్ణాటక)
- ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు (తెలంగాణ)
- రిషి వినయ్ (మహారాష్ట్ర)
- అర్పిత నారంగ్ (పంజాబ్)
- కృష్ణ ఎస్‌ఆర్ (కర్ణాటక)
- జీల్ విపుల్ వ్యాస్ (గుజరాత్)
- హాజిక్ పర్వీజ్ లోన్ (జమ్మూకశ్మీర్)