గోషామహల్‌లో తీవ్ర ఉద్రిక్తత..
హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన శంకుస్థాపన విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం 12 గంటల ప్రాంతంలో గోషామహల్‌లోని ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ సందర్భంలో ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు అల్లర్లు చేస్తున్నారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, స్థానికుల ఇబ్బందులను గుర్తించడం లేదని మండిపడుతున్నారు. బంద్‌లకు పిలుపు ఇవ్వడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆసుపత్రి కడితే తమకు రోగాలు, మార్చురీ వాసనలు వస్తాయని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిని అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిని గోషామహల్ వంటి ఇరుకైన ప్రాంతంలో చేస్తే చాలా కష్టం. వర్షం వస్తే ఇక్కడి రోడ్లు మునిగిపోతాయి. అత్యవసర సేవల కోసం ప్రజలు ఈ ఇరుకు రోడ్లలో ఆసుపత్రిని వేగంగా చేరుకోలేరని, ముఖ్యమంత్రి మరోసారి ఈ నిర్ణయాలని పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

