అత్తిలిలో తీవ్ర ఉద్రిక్తత..
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో అత్తిలిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 20 స్థానాలకు గాను వైసీపీకి 15, టీడీపీకి 3, జనసేనకు 2 స్థానాలు ఉన్నాయి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వైసీపీ ఎంపీటీసీలను క్యాంపులో ఉంచడంతో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించారు. వైసీపీ నుండి ఎంపీపీ రేసులో రంభ సుజాత ఉన్నారు. టీడీపీ నుండి రేస్‌లో మక్కా సూర్యారావు, కొనకళ్ల విజయనిర్మల ఉన్నారు. 2021లో వైసీపీ నుండి గెలిచిన ఎంపీపీ సూర్యారావు ఇటీవల టీడీపీకి జంప్ అయ్యారు. దీనితో ఉప ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఎంపీటీసీలందరూ కూటమికి సపోర్టు చేస్తున్నారని, కానీ వారిని కారుమూరి నిర్భందించారని కూటమి నేతలు ఆందోళనలు చేస్తున్నారు. వైసీపీ, కూటమి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ వారు ఎన్నికలకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కూటమి కార్యకర్తలు కారుమూరి ఇంటి వద్ద భారీగా పోగయ్యారు. దీనితో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

