పాట రూపంలో తన బాధను వ్యక్తం చేస్తున్న రైతన్న
తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వరుసగా వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల వడగండ్ల వానలు కురవడంతో మొక్కజొన్న, బొప్పాయి, ఉల్లి, పత్తి, టమోటా, మిరప వంటి పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక తెలంగాణలోని ఓ రైతన్న పాట రూపంలో తన ఆవేదనను వ్యక్తం పరిచాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయితీలో రామ్మూర్తి అనే రైతు అకాల వర్షంలో దెబ్బతిన్న తన మొక్కజొన్న పంట చూసి ఆవేదనతో… పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశారు. అది చూసిన నెటిజన్లు అయ్యో రైతన్నకు ఎంత బాధను మిగిల్చాయి ఈ అకాల వర్షాలంటూ.. కామెంట్లు పెడుతున్నారు.