పాకిస్తాన్‌లో పేట్రేగిపోతున్న ఉగ్రవాదులు
బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యంపై 24 గంటల్లో రెండవ దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది గాయపడినట్లు ప్రకటించారు. పాకిస్తాన్ సైన్యంపై ఈ దాడి కెచ్ జిల్లాలో జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబులతో దాడి చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.శుక్రవారం బలూచ్ సైన్యం పాకిస్తాన్ బందీలుగా ఉంచిన 214 మంది సైనికులను హతమార్చింది. ఖైదీలను మార్పిడి చేసుకోవడానికి పాకిస్తాన్ సైన్యానికి 48 గంటల అల్టిమేటం ఇచ్చినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. కానీ పాకిస్తాన్ సైన్యం నుండి షాబాజ్ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. షాబాద్ మొండితనం కారణంగా 214 మంది సైనికులు మరణించారు.మరోవైపు బలూచిస్తాన్ రైలు దాడిలో మరణించిన 26 మంది బందీలలో 18 మంది భద్రతా సిబ్బంది అని పాకిస్తాన్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సైన్యం ఆపరేషన్ ప్రారంభించే ముందు ఉగ్రవాదులు 26 మంది బందీలను చంపారని తెలిపారు. 18 మంది భద్రతా సిబ్బందితో పాటు, మరో ముగ్గురు ప్రభుత్వ అధికారులు, ఐదుగురు పౌరులు కూడా ఉన్నారు.