ఘాటెక్కిస్తున్న పచ్చిమిర్చి రేటు@350
ఇప్పటికే దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాటా ధర సగటున రూ.100కు పైన పలుకుతోంది. ఈ నేపథ్యంలో బెంగాల్,కోల్‌కతాలో పచ్చిమిర్చి ధర రికార్డు స్థాయిలో రూ.350కి చేరింది. అయితే అల్లం ధర కూడా అదే స్థాయిలో ధర పలుకుతోంది. కాగా త్వరలోనే వీటి ధర రూ.400కు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మిర్చిని ఎక్కువగా సాగుచేసే ఏపీ రైతులు ఈ ఏడాది ఇతర పంటలకు మళ్లడంతో సరఫరా తగ్గింది. దీంతో వీటి దిగుమతిపై ఆధారపడిన కోల్‌కతాలో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కాగా ఇప్పటికే పెరిగిన టమాటా ధరలతో దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య,మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఇప్పుడు మిర్చిరేటు కూడా రికార్డు స్థాయిలో పెరగడంతో సామాన్యుడిపై ఆర్థిక భారం మరింతగా పెరిగింది.

