టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్
టిపిన్ సెంటర్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం చోటు చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. హైదరాబాద్ లోని నిజాంపేట్ ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.పక్కనే ఉన్న పలు దుకాణాలకు మంటలు వ్యాపించాయి.స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నిలువరించారు.కాగా ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మొత్తం మూడు దుకాణాలు,ఒక గృహానికి మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.