బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ
టిజి: రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తెరపైకి వచ్చి హడావుడి జరిగినా.. ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగింది. ఎంపీలు ఈటల, డీకే అరుణ, అర్వింద్, రఘునందన్‌రావు పోటీపడుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అధ్యక్ష పదవి కోసం పాత, కొత్త నాయకుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొనడంతో ఎంపిక జఠిలంగా మారిందని సమాచారం.