Home Page SliderTelangana

బిల్లు ఆమోదం పొందేవరకు పోరాటం కొనసాగిస్తామన్న ఎమ్మెల్సీ కవిత

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు కె.కవిత నేడు న్యూఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద కవిత చేపట్టిన నిరసన కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలతో సహా పలు పార్టీల నేతలు పాల్గొంటున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడానికి ఒక రోజు ముందు ఇది జరుగుతోంది.మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో పెట్టి ఆమోదింపజేయాలంటూ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగారు. మహిళా బిల్లు ఆమోదించేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు కవిత. ఎన్నో అడ్డంకుల తర్వాత బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని కవిత చెప్పారు. ఈ దీక్షలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సీపీఎం సంపూర్ణ మద్దతిస్తోందన్నారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి.

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత మాట్లాడుతూ 18 పార్టీలు నిరసనలో పాల్గొంటున్నాయని చెప్పారు. “మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో నిరాహారదీక్ష గురించి మార్చి 2న మేము పోస్టర్‌ను విడుదల చేసాం. మార్చి 9న ED విచారణకు రమ్మని పిలిచింది. మార్చి 16న వస్తానని అభ్యర్థించా, కానీ వారు ఏ తొందరలో ఉన్నారో తెలియదు, కాబట్టి నేను మార్చి 11న వచ్చేందుకు అంగీకరించా” అంచూ దేశ రాజధానిలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. “నన్ను ప్రశ్నించడానికి ED ఎందుకు హడావిడిగా ఉందో… నా నిరసనకు ఒక రోజు ముందు ఎందుకు? దీక్ష తర్వాత కూడా విచారించవచ్చన్నారు. ఢిల్లీలో రద్దు చేసిన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కిక్‌బ్యాక్‌ల ద్వారా లబ్ది పొందిన “సౌత్ గ్రూప్‌”లో కవిత భాగమని ED ఆరోపిస్తోంది. ఐతే కవిత ఈ ఆరోపణలను ఖండించా. రురాజకీయ లక్ష్యాల కోసం కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత మాట్లాడుతూ.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చినా మాట నిలబెట్టుకోలేదన్నారు. లోక్‌సభ, అసెంబ్లీలలో 1/3 వంతు స్థానాలను రిజర్వ్ చేయడానికి రాజ్యాంగ సవరణను చట్టం ప్రతిపాదిస్తుంది. కవిత దీక్షకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి మద్దతు తెలిపారు.