ఆ విద్యార్థులకు పరీక్షలు లేవోచ్..!
పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థి టీచర్స్ అంటే భయపడతారో లేదో కానీ పరీక్షలు అంటే మాత్రం అందరూ భయపడతారు. మరి ఎవరైన ఆ పరీక్షలు మీరు రాయనవసరం లేదు అంటే వాళ్ల ముఖాల్లో వచ్చే ఆనందం అంత ఇంత కాదనే చెప్పాలి. అయితే మరి ఎవరికి పరీక్షలు నిర్వహించరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇకపై 2వ తరగతి వరకు రాత పరీక్షల వద్దని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ కేంద్రానికి సూచించింది. కాగా ఇది విద్యార్థులకు ఒత్తిడితో కూడిన అదనపు భారమని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ భావించింది. 3వ తరగతి నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే 6 నుంచి 8 తరగతుల వారికి కాన్సెప్టులు అర్థమయ్యేలా ప్రాజెక్టులు,చర్చలు,ప్రజెంటేషన్లు ,ప్రయోగాలతో అభ్యాసన జరగాలని పేర్కొంది. 9 నుంచి 12 వ తరగతి క్లాసుల వారికి ప్రాక్టీస్ చేయిస్తూ బోర్డు,పోటి పరీక్షలకు సిద్ధం చేయాలని నేషనల్ ఫ్రేమ్‌వర్క్ పిలుపునిచ్చింది.