మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకున్న సిఐడి తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అరెస్ట్ చేసింది. ఈ ఉదయం గంట శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలకపాత్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుట్ర పూరితంగా… కార్పొరేషన్ ఏర్పాటు చేశారని నివేదికలో సిఐడి ఆరోపించింది.

మరో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం కేసులో ఇద్దరు మంత్రులను పూర్తి సాక్ష్యాధారాలతోనే అరెస్టు చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.