అన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారు: కేసీఆర్
మోదీ ప్రభుత్వం దేశంలో అన్నీ ప్రైవేటు పరం చేస్తోందని మునుగోడు సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. `ఎయిర్ పోర్టులు, బ్యాంకులు, విమానాలు, రైళ్లు, గ్యాస్.. ఒక్కటేమిటి అన్ని కంపెనీలను వరుస పెట్టి అమ్ముతున్నారు. ఇక మిగిలింది రైతులు. భూములనూ బడా పెట్టుబడిదారులకు అమ్మేసి.. అందులోనే మన రైతులతో కూలీలుగా పని చేయించాలని కుట్ర పన్నుతున్నరు. వాళ్లకు వ్యతిరేకంగా పోరాడదాం. నా బలం మీరే కదా. నా ధైర్యం మీరే కదా. మీరే నన్ను ఆగం చేస్తే.. నన్ను గుద్ది కింద పడగొడతారు. మీ పొలాల్లో మోటార్లకు మీటర్లు పెడ్తారు. మునుగోడులో డిపాజిట్ రాలేదు. వస్తే. మన బాయికాడ మీటర్ పడుతుంది. మీటర్లు వద్దన్న టీఆర్‌ఎస్ కావాలా.. మీటర్లు పెట్టాలన్న మోదీ కావాలా.. మీ గ్రామాల్లో వెళ్లి చర్చ పెట్టండి` అని మునుగోడు ప్రజలను కేసీఆర్ వేడుకున్నారు.

