కుంభమేళాపై అన్నీ కాకుల లెక్కలే..అఖిలేశ్
లోక్‌సభలో కుంభమేళా తొక్కసలాట అంశం మరోసారి అగ్గి రాజేసింది. ప్రతిపక్షాలు ఈ ఘటనపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఘటనలో అన్నీ కాకుల లెక్కలే చెప్తున్నారని, వాస్తవానికి అనేకమంది మృతి చెందారని, కానీ వాస్తవాలు దాచిపెట్టి కేవలం 30 మందే మృతి చెందినట్లు చెప్తున్నారని ఆరోపించారు. మృతుల సంఖ్యపై అధికారిక సమాచారం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. కుంభమేళా నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని, కేవలం వీఐపీలకు మాత్రమే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. మృతదేహాలను నదిలో వేయడం వల్ల కుంభమేళా వద్ద నీరు అత్యంత కలుషితమయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఈ బాధ్యతలను సైన్యానికి అప్పగించాలని సూచించారు అఖిలేశ్.