ఇంటి నుండి ప్రతి ఒక్కరూ బయటికి రండి ఓటెయ్యండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లను బుధవారం సాయంత్రం నాటికి సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుస్తామన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ బయటికి రండి ఓటెయ్యండి. అది మీ హక్కు, దాన్ని మీరు దుర్వినియోగపరచవద్దు.


 
							 
							