ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి ఆగకూడదన్న-KTR
సిరిసిల్ల: అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని రకాలుగా ప్రలోభపెట్టినా, ప్రత్యర్థులు కుట్రలు చేసినా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు తనవైపే నిలిచి దాదాపు 30 వేల మెజారిటీతో గెలిపించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బుధవారం సిరిసిల్లకు వచ్చారు. బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సిరిసిల్ల అభివృద్ధి జరగాల్సిందేనని స్పష్టం చేశారు.

