Home Page SliderNationalNews AlertPolitics

‘నేను జైలుకు పోయినా మీ ఉద్యోగం కాపాడతా’..సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికున్నంత కాలం అర్హులైన టీచర్ల ఉద్యోగాలు కాపాడతానని, తాను కోర్టు ధిక్కార నేరం కింద  జైలుకు పోయినా పర్వాలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర టీచర్లతో సమావేశమైన దీదీ వారికి హామీ ఇచ్చారు.  ఉద్యోగ నియామకాలలో అక్రమాలు జరిగాయంటూ 26 వేల మంది  పశ్చిమబెంగాల్ టీచర్ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఆమోదయోగ్యంగా లేదని, తనను జైలులో పెట్టినా సరే వారి ఉద్యోగాలను కాపాడతానని పేర్కొన్నారు.