కేసీఆర్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ తనకు తాను ఒక చక్రవర్తిలా వ్యవహరిస్తారని, ఆయన తనకు ఎవరూ ఎదురు చెప్పవద్దని, విమర్శించవద్దని, తనను తప్పుపట్టద్దని అనుకుంటారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈటల.. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో దుమారం రేపిన కవిత వ్యవహారంపై స్పందించారు. ఆయన రాచరికపు పోకడలు, నియంతృత్వం, నమ్ముకున్నోళ్లను ఆయన నట్టేట ముంచే పద్ధతి, వ్యక్తులను వాడుకుని వదిలేసే నైజం ఫలితమే రాజకీయంగా ఆయనను బొందపెట్టిందన్నారు. కవితకు వాళ్ల కుటుంబంలో ఎక్కడో ఏదో తేడా వచ్చిందని ఇక అతికే ప్రసక్తే లేదని ఈటల హాట్ కామెంట్స్ చేశారు. హరీశ్ రావు ఎపిసోడ్ ఈనాటిది కాదని 2016 నుంచి నడుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు బీజేపీతో టచ్ లో లేరని ఈటల స్పష్టం చేశారు.