హైకమాండ్ మెప్పుకోసమే ఈటల విమర్శలు..
బీజేపీ పై ఉన్న ఫ్రస్టేషన్ సీఎం రేవంత్ రెడ్డిపై చూపించడం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ తో పంచాయితీ పెట్టుకున్న ఈటల బీజేపీకి వెళ్లి అక్కడ ఇమడలేకపోతున్నారన్నారు. పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని, సీఎం అయిపోవచ్చనే పిచ్చి ఆలోచనతో ఈటల ఉన్నారని చామల పేర్కొన్నారు. కానీ బీజేపీలోని సీనియర్ నేతలు ఈటలను లాస్ట్ బెంచ్ కు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. దీంతో బీజేపీలో తన పరిస్థితి అర్థం కాక పార్టీ హైకమాండ్ వద్ద మంచి మార్కులు కోసం సీఎం రేవంత్ రెడ్డిని ఈటల విమర్శిస్తున్నారని ఎంపీ తెలిపారు.