హైకోర్టులో ఈటల రాజేందర్ పిటిషన్
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల పోచారం పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఆర్‌ను క్వాష్ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏకశిలానగర్‌లో స్థిరాస్థి వ్యాపారిపై చెయ్యి చేసుకున్నారని ఈటలపై వాచ్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోచారం పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఈ కేసులో అది ఆవేశంతో చేసిన చర్య అని, తనపై కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

