Home Page SliderTelangana

ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డికి మద్దతుగా ప్రచారంలో ఈటల

రంగారెడ్డి: ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి సామ రంగారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

పనామా గోదాం- రెడ్ ట్యాంక్- NGO కాలనీ- SKD నగర్- వైదేహి నగర్- హనుమాన్ టెంపుల్- సాహెబ్ నగర్ వరకు రోడ్ షో నిర్వహించారు. సాహెబ్ నగర్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ: మోదీ గారిని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించిన తరువాత మొదటి సభ ఎల్ బీ స్టేడియంలో తెలంగాణ గడ్డ మీద జరిగింది. ప్రధాని అయ్యారు. మొన్న మళ్లీ అదే గడ్డమీద నిల్చొని బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అని ప్రకటిచారు. అది సఫలం కావాలంటే మీ చేతుల్లో ఉంది. నాకు ఇప్పటివరకు ఓటమి లేదు. శ్రమను నమ్ముకుంటే, ప్రజలను నమ్ముకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అనే నమ్మకం ఉన్న వాణ్ణి.. సామ రంగన్నకి ఓటువేస్తే నాకు వేసినట్టే. కెసిఆర్ పాలనలో.. షీ టీమ్స్, సీసీ కెమెరాలు నిఘా ఉంది అని చెప్తున్న నేపథ్యంలో.. నందన వనంలో ముక్కుపచ్చలారని ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగితే స్పందన లేదు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో పోలీసులే ఒక మహిళ మీద చేసిన దౌర్జన్యం చూశాం. రక్షించాల్సిన పోలీసులే చెప్పకూడని చోట కొట్టారు.

మునుగోడు ఎన్నికల సందర్భంలో రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తా అన్నారు. 118 జి.వో ఇచ్చారు. ఎన్నికలు అయిపోగానే మర్చిపోయారు. బోడ మల్లన్న సామెత లాగా వ్యవహరించారు.  డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలే. రూ.5 లక్షలు ఇస్త అని ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తారట. ధరలు పెరిగాయా తగ్గాయా? బిజెపికి అవకాశం ఇవ్వండి ఇల్లు కట్టించే జిమ్మేదార్ మాది. నరేంద్ర మోడీకి కెసిఆర్ లాగా కొడుకులు, అల్లుళ్ళు, కూతుళ్లు, సడ్డకుని కొడుకులు లేరు.  దేశ ప్రజలందరూ ఆయన కుటుంబం. స్మశాన వాటికలకు, చెట్లు పెట్టడానికి, సిమెంట్ రోడ్లు వేయడానికి, మోరీలు కట్టడానికి పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం.  మహిళా సంఘ భవనాలు, మున్సిపల్ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ పేరు మాత్రం కేసీఆర్‌కి.

నరేంద్ర మోడీ గారి అండతో మీకు హామీ ఇస్తున్నా..

• ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా  అందిస్తాం.

• ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తాం.

• నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తాం.

• ఇద్దరు ముసలి వాళ్లకు పెన్షన్ అందిస్తాం.

• డబుల్ బెడ్ రూం ఇల్లు అర్హులందరికీ ఇస్తాం.

• ప్రజలకీ రక్షణ ఇచ్చే బాధ్యత మాది.

• స్థలాలకు రక్షణ కల్పిస్తాం.

• పెద్దవాళ్ళకు ఇళ్లస్థలం ఇస్తాం.

• మాదిగ ఎబిసిడి వర్గీకరణ కూడా జరగబోతోంది.

లంబాడా తండాలలో గుడుంబా బట్టీలు బంద్ పెడితే సంతోష పడ్డాం కానీ కెసిఆర్ లిక్కర్ తీసుకువచ్చారు. తాగిపించడంలో నంబర్ వన్ చేశారు.