Andhra PradeshHome Page Slider

ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో జగనన్న కాలనీల ఏర్పాటు

త్వరలోనే గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో జగనన్న కాలనీల ఏర్పాటు జరుగుతోందని పేర్కొన్నారు ఏపీ మంత్రి జోగి రమేష్. ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ స్థలాన్ని 50 వేల మంది పేదల పేరిట ఒక్కొక్క సెంటు భూమి చొప్పున స్థలాన్ని కేటాయిస్తున్నామని, వారికి ఆస్థలంలో ఇళ్లు కూడా కట్టించి ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు. ఈ ఇళ్లకు జగనన్న కాలనీలుగా నామకరణం చేసి, చరిత్రలో నిలిచిపోతాయని హర్షం వ్యక్తం చేశారు.

పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని, సెంటు భూమి ఎలా సరిపోతుందంటూ ఎద్దేవా చేస్తున్నారని, కానీ టీడీపీ హయాంలో అంత భూమి కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వంపై కోట్లు ఖర్చుపెట్టి కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, హైకోర్టులో, సుప్రీం కోర్టులో టీడీపీకే రివర్సయ్యిందని మండిపడ్డారు. ఆ సెంటు స్థలంలోనే టీడీపీని ప్రజలు పూడ్చి పెడతారని, గెలిచే సత్తా ఉంటే పవన్‌తో పొత్తు ఎందుకు పెట్టుకోవాలంటూ విమర్శిస్తున్నారు.