ఎలాన్ మస్క్ భారీ విరాళం.
ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారీ విరాళం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. టెస్లాలో తనకు ఉన్న 12.8 శాతం వాటాలు ఉన్నాయి. దీనిలో నుండి 2.68 లక్షల షేర్లను నూతన సంవత్సరం కంటే ముందుగానే ఛారిటీలకు ఇచ్చేశారు. వీటి విలువ 108.2 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇది భారత కరెన్సీలో రూ.927 కోట్లు ఉంటుంది. 2022నుండి ఆయన ఇలా టెస్లా షేర్లను దానం చేస్తున్నారు. మస్క్ ఫౌండేషన్ అనే ఛారిటీకి గతంలో 5.74 బిలియన్ డాలర్లు విరాళమిచ్చారు. ఈ సంస్థకు మస్క్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ కృత్రిమ మేధను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ, పలు ఛారిటీ కార్యక్రమాలు చేస్తోంది.
Breaking news: సీఎంఆర్ కాలేజీ వీడియోల ఘటన..యాజమాన్యం కీలక నిర్ణయం..