విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ మార్పు
తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది.ఈ విచారణలో సుప్రీంకోర్టు జడ్జి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 11న జస్టిస్ నరసింహరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై జస్టిస్ చంద్రఛూడ్ అభ్యంతంరం వ్యక్తం చేశారు. ఈ కేసుపై విచారణ పూర్తి కాకముందే..కమిషన్ తన అభిప్రాయం చెప్పిందన్నారు. ఈ విధంగా చూస్తే విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహరెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి కమిషన్ జడ్జిని మార్చే అవకాశం ఇస్తున్నామన్నారు.కేసీఆర్‌కు నోటీసు ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు..జడ్జ్ స్వయంగా మీడియాను అడ్రస్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. విద్యుత్ కమిషన్‌పై ఎంక్వైరీ జడ్జ్‌ని మార్చాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త జడ్జ్ పేరును మధ్యహ్నం 2 గంటలకు చెబుతామని ప్రభుత్వ తరుపు న్యాయవాది సింఘ్వీ తెలిపారు.దీంతో సుప్రీంకోర్టు ఈ కేసుపై విచారణను మధ్యహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
