Andhra PradeshNews

టీటీడీ ఉద్యోగులకు రాయితీపై ఎలక్ట్రిక్‌ వాహనాలు

టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ఏపీ సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల వాహనాల పార్కింగ్‌ షెడ్‌ను వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 54 లక్షలతో పార్కింగ్‌ షెడ్‌ను నిర్మించామని తెలిపారు. గతంలో ఇచ్చిన హామిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించామని వెల్లడించారు. అంతేకాకుండా తిరుమలలో పని చేసే ఉద్యోగులకు రాయితీపై ఎలక్ట్రిక్‌ వాహనాలు అందిస్తామని అన్నారు. మరోవైపు దాతలు టీటీడీకి 100 ఎలక్ట్రిక్‌ వాహనాలను విరాళంగా ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.