NationalNews Alert

నేడు మూడు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు డిసెంబరులో గడువు ముగియనుండటంతో ఎన్నికలను నిర్వహించనున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలకు గుజరాత్‌ , హిమాచల్‌ప్రదేశ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సొంత రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. నియోజకవర్గాల పునర్విభజన కొలిక్కిరావడంతో జమ్ము, కశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.