Home Page SliderTelangana

రేపే ఎన్నికల నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రేపు కీలక ఘట్టానికి తెరలేవనుంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేయనుంది. నోటిఫికేషన్ వెలువడడంతోనే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలౌతుంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. 13వ తేదీ వరకు పరిశీలన, 15వ తేదీతో ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అనంతరం ఏ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది తేలుతుంది.