రాహుల్ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం
హరియాణాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, దాదాపు 12.5% ఓట్లు చోరీ జరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం (ECI) ఖండించింది.
ఎన్నికల సంఘం స్పష్టంగా తెలిపింది — “రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదు. హరియాణాలో ఓటర్ల జాబితాపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు లేదా అప్పీలు దాఖలు కాలేదు.”
అలాగే, ఓటర్ల లిస్టు రివిజన్ సమయంలో మల్టిపుల్ ఓటింగ్ లేదా నకిలీ పేర్లను నివారించే ప్రక్రియ స్పష్టంగా అమల్లో ఉందని పేర్కొంది. “కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు?” అని EC వర్గాలు ప్రశ్నించాయి.
రాహుల్ గాంధీ తాజాగా హరియాణాలో జరిగిన ఓటర్ల జాబితా వివాదంపై వ్యాఖ్యానిస్తూ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని విమర్శించిన విషయం తెలిసిందే.

