అజారుద్దీన్ కు ఈడీ సమన్లు
టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన మనీ లాండరింగ్ కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు ఈడీ విచారణకు హాజరు కావాలని తొలిసారిగా సమన్లు జారీ చేసింది. అయితే అజారుద్దీన్ హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పల్ స్టేడియానికి డీజిల్ జనరేటర్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, జిమ్ ఎక్విప్ మెంట్స్ కొనుగోళ్లలో దాదాపు రూ. 20 కోట్ల మేర అక్రమాలు జరిగాయని సమాచారం.

