Home Page SliderNational

తమిళనాడులో ఈడీ సోదాలు.. భయపడేది లేదన్న సీఎం స్టాలిన్

తమిళనాడులో ఈ రోజు ఉదయం ఈడీ సోదాలు ప్రారంభమైయ్యాయి. ముందుగా ఈడీ అధికారులు తమిళనాడు ఉన్నత విద్యాశాఖమంత్రి పొన్నుడి ఇళ్లు,ఆఫీసులలో తనిఖీలు ప్రారంభించారు. అయితే దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో ఈడీ దాడులకు డీఎంకే భయపడే ప్రసక్తే లేదన్నారు. కేవలం కుట్ర పూరితంగానే ఈ దాడులు జరుగుతున్నాయని సీఎం ఆరోపించారు. అందుకే ఎప్పుడో 13 ఏళ్ల క్రితం కేసులో ఇప్పుడు సోదాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే కేంద్ర సంస్థలతో సోదాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే మనీలాండరింగ్ ఆరోపణలతో మంత్రి పొన్నుడి నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.