ముగిసిన ఈడీ సోదాలు.. ఎండీ ఇంట్లో భారీ నగదు సీజ్
హైదరాబాద్ నగరంలో సురానా, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు ముగిశాయి. సికింద్రాబాద్ బోయినపల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ, సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీశ్ చంద్రగుప్తా ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేసినట్లు తెలిసింది. అయితే, సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

