Home Page SliderNational

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ED నోటీసులు

ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. సాయిసూర్య డెవలపర్స్‌, సురానా ప్రాజెక్టు కేసుల్లో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది.ఆ రెండు సంస్థలకు మహేశ్‌బాబు ప్రచారకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. మహేశ్‌బాబుకు ఆయా సంస్థలు చెల్లించిన పారితోషికంపై ఆరా తీయనుంది.