పశుసంవర్ధక శాఖ ఆఫీసులో ఈడీ సోదాలు షురూ చేసింది
తెలంగాణ: గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల వ్యవహారంపై ఈడీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఆరా తీసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై వివరాలు ఇవ్వాలని ఆ శాఖ ఎండీకి లేఖ రాసింది.

