మరో టీఎంసీ ఎమ్మెల్యేను అరెస్టు చేసిన ఈడీ
పశ్చిమ బెంగాల్‌లోని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంతో లింకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మానిక్ భట్టాచార్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆధికారులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంతో లింకు ఉన్న రెండో తృణమూల్ పార్టీ నేత ఆయన. బెంగాల్ ప్రాథమిక విద్యాబోర్డు అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పలువురి నుంచి లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు.

ఈ కేసులో ఉన్న మాజీ మంత్రి పార్ధా ఛటర్జీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పార్ధా ఛటర్జీతో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రూ.50 కోట్లకుపైగా స్థిర, చరాస్తులు, నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే భట్టాచార్యకు వైద్య పరీక్షలు నిర్వహించాక.. కోర్టులో హాజరుపరుస్తారు.