వేసవిలో ఈ పండ్లు తింటే షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది…!
వేసవి కాలం వస్తే చాలు అందరికీ తెలిసిన ఒకే ఒక పండు మామిడి, కానీ చాల మందికి తెలియని ఒక అద్భుతమైన పండు కూడా ఉంది. అదే ఈ ఫాల్సా పండు, వేసవి కాలంలో లభించే ఒక ప్రత్యేకమైన పండు. ఈ పండు తినడం ద్వారా మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఫాల్సా పండులో ముఖ్యంగా విటమిన్ C మరియు విటమిన్ A అధికంగా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యాన్ని మెరుస్తాయి, మరియు శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు లాంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి పోషణను అందిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం కల్పిస్తుంది.ఈ పండు డయాబెటిస్ ఉన్నవారికి అత్యంత ప్రయోజనకరమైనది. ఇందులో ఉండే నేచురల్ షుగర్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వారానికి ఒకసారి తినడం కూడా షుగర్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మం ఆరోగ్యంగా మెరిసేందుకు సహాయ పడుతుంది. వృద్ధాప్య ఛాయలను నెమ్మదిస్తుంది. విటమిన్ సి ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. చర్మం మెరుస్తుంది. ఇందులో కొవ్వును తగ్గించే గుణాలు ఉన్నాయి.