రోడ్ సైడ్ ఫుడ్ తింటున్నారా? ఈ విషయం తెలిస్తే వామ్మో అంటారు!
ఈ రోజుల్లో బయట రోడ్ సైడ్ ఫుడ్ తినని వాళ్ళు ఎవరూ ఉండరు. ఫ్రెండ్స్ తో లేదా ఫామిలీతో బయటికి వెళ్ళినప్పుడు సరదాగా రోడ్ సైడ్ ఫుడ్ తింటుంటాం లేదా కనీసం టేస్ట్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వైరల్ ఫీవర్స్ పెరుగుతుండటంతో వాటికి దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోడ్ సైడ్ ఫుడ్ అనగా పానీపూరి, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ ఇంకా రోడ్డు పక్కన చిరుతిండ్లు మొదలైనవి తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వీటివల్ల వాంతులు , హెచ్ పైలోరి (కడుపులో మంట), టైఫాయిడ్, షిగెల్లోసిస్ (రక్త విరేచనాలు), జియార్డియాసిస్ (నీళ్ల విరేచనాలు), కలరా, ఎంటమీబా వంటి మొదలగునవి వ్యాధులు సోకుతాయి అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు బయట ఫుడ్ కి దూరంగా ఉండి ఇంట్లోనే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఫుడ్ ని తినడానికి ప్రయత్నం చెస్తే బెటరంటున్నారు. లేదంటే కొరివితో తలగోక్కునట్టేనంటున్నారు.

