16 నెలల తర్వాత మళ్లీ నాకిష్టమైన ఫుడ్ తిన్నా..: సమంత
తనకు ఇష్టమైన బ్రెడ్‌ను 16 నెలల తర్వాత తిన్నానని హీరోయిన్ సమంత తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
తనకు నచ్చిన ఇష్టమైన బ్రెడ్‌ను 16 నెలల తర్వాత ఇప్పుడు తిన్నానంటూ ప్రముఖ నటి సమంత వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన పోస్ట్‌కు ఎమోజీని జతచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు. దానికోసం విదేశాలకూ వెళ్లారు. ట్రీట్‌మెంట్ జరుగుతున్న కారణంగా ఇన్ని రోజులు తాను బ్రెడ్‌కు దూరమైనట్లు తెలుస్తోంది.
సమంత సినిమాల విషయానికొస్తే ఇటీవల ఖుషీతో అలరించారు. ఈ సినిమా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సిటడెల్ (ఇండియన్ వెర్షన్) షూట్ పూర్తైన వెంటనే వర్క్ లైఫ్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్‌సిరీస్ త్వరలోనే విడుదలకానుంది. సల్మాన్‌ఖాన్ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో సమంత కథానాయికగా నటించనున్నారనే రూమర్స్ వచ్చాయి. నటనకు కాస్త దూరంగా ఉన్నా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులను తరచూ పలకరిస్తూనే ఉన్నారు సమంత. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్ సందర్శించిన ఆమె అక్కడ తనకెంతో ఇష్టమైన లొకేషన్స్ దగ్గర ఫొటోలు దిగి వాటిని షేర్ చేశారు. అవినెట్టింట వైరల్‌గా మారాయి.

