ఈటల గెలుపు.. తెలంగాణ మలుపు.. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్
జితేందర్ సింగ్ , పీఎంవో మంత్రి
ఢిల్లీ నుంచి నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా? ఈటల నామినేషన్ కార్యక్రమానికి వెళ్లండని ప్రధాని మోడీ చెప్పారు. అందుకే నేను ఇవాళ ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యాను. ఇవాళ మీ ఆదరణ చూస్తుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందనిపిస్తోంది. బీజేపీ గెలిస్తే ఈటల ఏమవుతారో మీకు తెలుసు. ఆయనను ఆశీర్వదించండి. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ పార్టీ… నన్ను వెళ్లి హుజూరాబాద్ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పింది. అంటే ఈటల రాజేందర్, బీజేపీ పార్టీకి ఎంత ముఖ్యమో తెలుసుకోండి. కేసీఆర్ అవినీతి పాలన అంతమొందాలంటే ఈటలను గెలిపించాలి. బీజేపీ ప్రభుత్వం రావాలి. గుజరాత్, రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తోంది. దేశమంతటా గెలుస్తోంది. తెలంగాణలో ఎందుకు గెలవదు. బీజేపీ గెలిస్తే రాజేందర్ పెద్ద నాయకుడు అవుతారు. నేను ఢిల్లీ వెళ్లాక మోదీకి ఇదే విషయం చెబుతాను. ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ఢిల్లీలో ప్రధాని మోడీకి చెప్తా..


