Breaking NewscrimeHome Page SliderNational

భార‌త్ నేపాల్ స‌రిహ‌ద్దుల్లో భూకంపం

హిమాలయ పర్వత ప్రాంతంలో మళ్లీ భూకంపం సంభవించింది. మిత్రదేశం నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ భూకంపం వచ్చింది. దీంతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.భూకంప తీవ్ర‌త‌ రియాక్టర్‌ స్కేల్‌పై 6.1 గా నమోదైంది. ఆ ప్రకంపనలు భార‌త్ లోనూ కనిపించాయి. బిహార్‌లో కూడా ఈ భూకంపం ఎఫెక్ట్ కనిపించింది. అసోంలో భూకంపం వచ్చిన 24 గంటల్లోనే నేపాల్‌లో భూ ప్రకంపనలు రావడం కలవరపెడుతోంది. హిమాలయా మధ్య ప్రాంతంలోని సింధుపాల్‌చౌక్ జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్‌లో మాత్రమే కాకుండా భారత్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాలతో పాటు.. బిహార్, బెంగాల్, సిక్కింలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలు తమ ఇళ్లు, భవనాలోంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు.