పాక్ లో భూకంపం…
పాకిస్తాన్ లో ఇవాళ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. మధ్యాహ్నం 1.26 గంటలకు భూకంపం సంభవించిన ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకోవడంతో మరిన్ని ప్రకంపనలకు అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. రెండు రోజుల క్రితమే పాక్ లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపాలకు అనువైన ప్రాంతంగా ఉండటంతో పాకిస్తాన్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఆ దేశం భౌగోళికంగా యూరోపియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఉంది.

