ఢిల్లీలో భూకంపం
దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భూకంపం భయభ్రాంతులకు గురి చేసింది. ఢిల్లీ NCR లో బలమైన భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 9:04 గంటలకు భూమి అకస్మాత్తుగా కంపించడం ప్రారంభించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లలో దాదాపు 10 సెకన్ల పాటు భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, ఝజ్జర్, బహదూర్గఢ్ సహా అనేక నగరాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో ఉందని చెబుతున్నారు. భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.