BusinessHealthHome Page SliderNational

మఖానాతో కోట్ల సంపాదన-నిఖిల్ కామత్

జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అనేక రకాల పెట్టుబడి ఉపాయాలు సోషల్ మీడియాలో చెప్తుంటారు. ఆయన ఇటీవల పాడ్‌కాస్ట్ ద్వారా ప్రధాని మోదీని ఇంటర్యూ చేశారు. తాజాగా నిఖిల్, కామత్  మఖానా సాగుతో కోట్లు సంపాదించవచ్చు అంటూ ట్వీట్ చేశారు. ఫాక్స్ నట్ అని పిలువబడే ఈ మఖానా ప్రపంచంలోనే అత్యంత సూపర్‌ఫుడ్‌లలో ఒకటి. ఈ మఖానా సరఫరాలో బీహార్ అగ్రస్థానంలో ఉంది. కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, ఫాస్పరస్, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండిన మఖానాలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యం, మధుమేహం వంటి వ్యాధులకు బాగా పనిచేస్తుంది.