దసరా స్పెషల్ గిఫ్ట్‌గా కోడి, క్వార్టర్ మందు బాటిల్
ఏపీలో ఎన్నికలకు ఇంకా 6 నెలలు టైమ్ ఉంది. కానీ అభ్యర్థులు మాత్రం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పుడే ఇన్ని మందు బాటిళ్లు ఇస్తుంటే.. రేపోరోజు ఎన్ని కోళ్లు, మందు బాటిల్స్ ఇస్తారో ఊహించడమే కష్టంగా ఉంటోంది. దసరా సందర్భంగా పలు జిల్లాల్లో నాయకులు, ప్రజలకు కానుకలు పంపిణీ చేశారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే గణేష్ అనుచరుడు బాపు ఆనంద్ మనిషికి ఒక కోడి మందు బాటిల్‌ని అందించారు. వీటిని తీసుకునేందుకు స్థానికులు క్యూ కట్టారు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు ఉన్నప్పటికీ నేతలు ముందు చూపు బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఊరకనే వస్తే పినాయిల్ అయినా ఓకే అన్న సామెత ఉండనే ఉంది. ఇక కోడి, క్వార్టర్ తీసుకుంటున్న కొందరు మందుబాబులు, లావు కోడివ్వి.. పెద్ద కోడివ్వని కొసరి కొసరి అడగటం కన్పించింది. అదే సమయంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండంటూ సదరు దాత కూడా స్థానికులకు విజ్ఞప్తి చేసుకోవడం కూడా జరిగింది. రండి రండి పేరు పెట్టి పిలిచి మరీ కోడి, క్వార్టర్ చేతిలో పెట్టడం విశేషం.
