NationalNews Alert

యాక్టర్‌గా పనికిరానన్నారు..దుల్కర్     

 సీతారామం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్ ప్రారంభంలో సినిమాల రివ్యూలు చదివే వాడినని చెప్పారు. ఆ రివ్యూ చదివినప్పుడు చాలా భాదేసేదని తెలిపారు. నటనను చూసిన వారు విమర్మిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారని , నాకు నటన రాదని.. నేను నటించడం ఆపేయడం మంచిదని కామెంట్స్ చేసేవారని చెప్పారు. నా తండ్రిలా నేను నటుడిగా రాణించలేనని , అసలు యాక్టర్‌గానే పనికిరానన్నారు. ఆ వ్యాఖ్యలు నన్ను ఎంతగానో బాధించాయన్నారు. సీతారామం సినిమా పై మీరు చూపించిన అభిమానం , ప్రేమ ఎప్పటికి మర్చిపోలేనని దుల్కర్  చెప్పుకొచ్చాడు.