accidentHome Page SliderTelangana

రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి

రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో జ‌రిగింది.మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి.జవహర్ లాల్ (50) సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజ్ గోపాల్ పేట గ్రామ శివారులోని ఫైరింగ్ రేంజ్ లో ఇన్ సర్వీస్ కానిస్టేబుల్స్ కు నిర్వహించిన ఫైర్ టెస్టింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి మేడ్చల్ కు కారులో వెళ్తున్నారు. మార్గమధ్యలో కుకునూర్ పల్లి మండలం చిన్నకిష్టాపూర్ చౌరస్తా వద్ద చిన్నకిష్టాపూర్ గ్రామం వైపు నుంచి వస్తున్న కారు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు తిప్పడంతో ఆ కారు ను తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న యాడ్స్‌ బోర్డును ఢీకొట్టింది.కారు లో ఉన్న మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి. జవహర్ తలకు, ఛాతీలో గాయాలు కాగా.. కారు డ్రైవర్ కాళ్లకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వారి వెనుకే వస్తున్న మేడ్చల్ పి టి సీ సిబ్బంది వారిని ములుగు మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామ శివారు లోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి జవహర్ లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.