తిరుమలలో మద్యం తాగిన వ్యక్తి హల్చల్
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో లోపం బయటపడింది. తిరుమలలో మద్యం తాగి ఓ వ్యక్తి నానా హంగమా చేశాడు. తిరుమల ఆలయ మాఢ వీధుల్లో మద్యం తాగిన వ్యక్తి ‘నేను లోకల్.. మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా’ అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ముందరే రెచ్చిపోయాడు. అయితే.. తిరుమలకు ఆ వ్యక్తి తాగి ఎలా వచ్చాడు అన్న వివరాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

