Breaking NewscrimeHome Page SliderTelangana

యాద‌గిరిగుట్టులోనూ డ్ర‌గ్స్‌!

తెలంగాణ అంటేనే డ్ర‌గ్ స్టేట్ అనే భావ‌న‌కు తీసుకెళ్లారు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా ముఠా.ఇన్నాళ్లు క‌మ‌ర్షియ‌ల్ జోన్స్ లో మాత్ర‌మే క‌నిపించిన ఈ ముఠా దందా ఇప్పుడు సాక్షాత్తు ల‌క్ష్మీన‌ర‌సింహుడు కొలువైన యాదగిరిగుట్ట‌కు కూడా పాకించేశారు. మంగ‌ళ‌వారం యాదగిరిగుట్టలో డ్రగ్స్‌ కలకలం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . రామాజీ పేటలోని యాదాద్రి లైఫ్ సైన్సెస్‌ ఫ్యాక్టరీ కేంద్రంగా ఈ డ్రగ్స్‌ తయారీ న‌డుస్తున్న‌ట్లు పోలీసుల ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఫ్యాక్టరీ నుంచి డ్రగ్స్‌ తరలిస్తుండగా టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు ప‌ట్టుకోవ‌డంతో ఈ భాగోతం వెలుగులోకి వ‌చ్చింది.డ్ర‌గ్స్ త‌ర‌లిస్తున్న 6గురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేష‌న్ కి త‌ర‌లించి విచారిస్తున్నారు.

BREAKING NEWS: రోడ్డు ప్రమాదంలో సిమెంట్ లారీ దగ్ధం