Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

మ‌త్తు మాత్ర‌లిచ్చి మాన‌సిక విక‌లాంగుల్ని చేస్తూ…

విశాఖ వ్యాలీలో ఉన్న జువైన‌ల్ హోమ్స్ ఉంటున్న బాలిక‌లు,యువ‌తుల‌కు మ‌త్తు మాత్ర‌లిచ్చి మాన‌సిక విక‌లాంగులుగా మారుస్తున్న ఘ‌ట‌న గురువారం తీవ్ర క‌ల‌క‌లం రేపింది.ప‌లువురు బాలిక‌లు జువైనల్ హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చి ఆత్మహత్యా ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఈ భాగోతం వెలుగు చూసింది. జువైనల్ హోమ్స్ లో తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ బాధితులు,వారి వారి బంధువుల‌తో క‌లిసి ఆరోపిస్తున్నారు.హోమ్స్ వెలుప‌లికి బ‌ల‌వంతంగా వ‌చ్చిన వారంతా… తమను వెంటనే బయటికి తీసుకెళ్లాలని కేకలు వేస్తూ పెంకులు రువ్వారు.బూతులు తిడుతూ ర‌చ్చ ర‌చ్చ చేశారు.అటుగా వెళ్తున్న వారు పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో అంద‌రిని అదుపులోకి తీసుకుని సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.దీనిపై హోంమంత్రి అనిత స్పందిస్తూ..త‌క్ష‌ణ‌మే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా బాలికల ఫిర్యాదుపై చైల్డ్ రైట్స్ కమిషన్ విచార‌ణ చేప‌ట్టింది.