వేల కోట్ల రూపాయల డ్రగ్స్ లారీ సీజ్
కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రవైపు వెళ్తున్న డ్రగ్స్ లారీని సంగారెడ్డి పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు.మాడిగ చెక్‌పోస్టు వద్ద పోలీసులు నాకాబందీ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ భాగోతం వెలుగు చూసింది.100 గ్రా.డ్రగ్స్ రూ. లక్షల్లో ఉంటే..ఇక టన్నుల కొద్దీ లభ్యం అయిన డ్రగ్స్ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు.ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ అక్రమంగా వెలుగు చూడటం ఇదే తొలిసారి కావడం గమమార్హం.డ్రగ్స్ లారీని సీజ్ చేసి లారీ డ్రైవర్,క్లీనర్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

