Andhra PradeshHome Page SliderNews

గేమ్ ఛేంజర్‌గా అమరావతిలో డ్రోన్ సమ్మిట్

రెండు రోజుల పాటు అమరావతిలో నేడు గొప్ప డ్రోన్ సమ్మిట్-2024 జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాబోయే రోజులలో డ్రోన్స్ గేమ్ ఛేంజర్‌గా మారుతాయన్నారు. 1995లోఐటీ గురించి ఆలోచించి, అనేక కంపెనీలను తీసుకొచ్చామని, ఇప్పుడు దేశంలోనే గొప్ప నగరంగా మారిందన్నారు. అలాగే భవిష్యత్తులో డేటా ముఖ్యమని, డబ్బు కాదని పేర్కొన్నారు. ఈ సదస్సు జాతీయ స్థాయిలో రెండు రోజుల పాటు జరగనుంది. 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, డ్రోన్ పాలసీ పత్రం ఆవిష్కరణ ఉంటాయి. ఈ రంగంలో ఏపీని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.కృష్ణానదీ తీరంలో 5,500 డ్రోన్లతో నేడు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకూ ఈ ప్రదర్శన ఉంటుంది. ఇవి అర కిలోమీటర్ ఎత్తులో ఏడు ఆకృతులు ఆవిష్కరిస్తాయి.